ఆ హీరోయిన్ దగ్గర కాల్ రికార్డులు!

ఆమె ఓ హీరోయిన్. ఇప్పుడు ఏ సినిమాలు చేయకున్నా, ఓసారి హీరోయిన్‌గా చేసారు కనుక ఎప్పటికీ హీరోయిన్ నే. ఆ హీరోయిన్ తరచు ఓ దర్శకుడిని సోషల్ మీడియాలో టార్గెట్ చేస్తుంటారు. అన్యాపదేశంగా సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టినా, ఎవరిని టార్గెట్ చేస్తూ ఆ పోస్ట్ లు పెడుతున్నారో తెలిసిపోతూనే వుంటుంది.

కానీ గమ్మత్తేమిటంటే అటు నుంచి ఎప్పుడూ ఎటువంటి స్పందన వుండదు. ఎందుకు స్పందిస్తారు.. ఆ దర్శకుడిని పేరు పెట్టి కామెంట్ చేస్తే కదా. అని అనుకోవాల్సి వస్తూ వుంటుంది.

కానీ నిజానికి ఆ దర్శకుడు అంటే సదరు హీరోయిన్ కు పీకల మేరకు కోపం, కసి వుందని తెలుస్తోంది. ఆ దర్శకుడి వల్లే తన జీవితం నాశనం అయిపోయిందని, ఎప్పటికైనా ఆ దర్శకుడి నిజ స్వరూపం బయటకు రావాల్సిందే అని ఆమె సన్నిహితుల దగ్గర చెబుతూ వుంటుంది. ఇవన్నీ తెలిసినా అటు నుంచి ఎటు వంటి రియాక్షన్ పబ్లిక్ గా కానీ, ప్రైవేటుగా కానీ వుండదు.

దీనికి కారణం, ఆ దర్శకుడు, ఈ హీరోయిన్ తో మాట్లాడిన కాల్ రికార్డులు కొన్ని ఆమె దగ్గర వుండడమే అని తెలుస్తోంది. ఆ దర్శకుడు మాట్లాడిన మాటలు, ఇచ్చిన కొన్ని ప్రత్యేక సలహాలు ఇవన్నీ ఆ హీరోయిన్ దగ్గర కాల్ రికార్డుల రూపంలో వున్నాయని తెలుస్తోంది. అందుకే ఆమె ఎన్ని సార్లు సోషల్ మీడియా సాక్షిగా కామెంట్ లు చేసినా, అటు నుంచి నేరుగా కానీ, పరోక్షంగా కానీ స్పందన వుండదు.