కూలీగా మారిన సూపర్ స్టార్

దర్శకుడు లోకేష్ కనగరాజ్ మేకింగ్ స్టయిల్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. హీరోయిజం పీక్స్ లో చూపిస్తాడు. ఇతడి మేకింగ్ లో సూపర్ స్టార్ రజనీకాంత్ ను చూస్తే ఎలా ఉంటుంది? ఆ అనుభూతి కొద్దిసేపటి కిందట అందరికీ అందింది.

లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ చేస్తున్న సినిమాకు కూలీ అనే టైటిల్ పెట్టారు. అదిరిపోయే యాక్షన్ వీడియోను విడుదల చేశారు. లోకేష్ టేకింగ్, రజనీ స్టయిల్, అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, మంచి ఫ్రేమ్స్.. ఇలా అన్ని విభాగాల్లో టాప్ అనిపించుకుంది కూలీ టైటిల్ టీజర్.

కూల్ గా కనిపించిన రజనీ, వీరోచితంగా చేసిన ఫైట్స్ టీజర్ లో హైలెట్ గా నిలిచాయి. "విందు, మందు, చిందు, సుఖం ఉంది.. అనుభవించే మనసున్నోళ్లకు స్వర్గంలో చోటు ఉంటుంది పోరా" అంటూ సూపర్ స్టార్ చెప్పిన డైలాగ్ ఆసక్తికరంగా ఉంది.

సన్ పిక్చర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా, గోల్డ్ మాఫియా బ్యాక్ డ్రాప్ తో వస్తోందనే విషయం టీజర్ చూస్తే ఇట్టే అర్థమౌతుంది. ప్రస్తుతం షూటింగ్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమా విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తారు. కెరీర్ లో సూపర్ స్టార్ కు ఇది 171వ సినిమా.