నాన్న కోసం వాయు వేగం

కేవలం కొత్త కథలు, కాన్సెప్టులు, టాలెంట్ ను పరిచయం చేసేందుకే యూవీ కాన్సెప్ట్స్ పెట్టారు. తక్కువ బడ్జెట్ లో మంచి కంటెంట్ తీసి, ఇటు థియేట్రికల్ గా, అటు నాన్-థియేట్రికల్ గా లాభాలు అందుకోవాలనేది దీని ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగా యూవీ కాన్సెప్ట్స్ నుంచి మరో సినిమా రెడీ అవుతోంది. దీని పేరు భజే వాయువేగం.

షార్ట్ గ్యాప్ తర్వాత ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు హీరో కార్తికేయ. ఈరోజు ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు. విశ్వంభర సెట్స్ లో చిరంజీవి చేతుల మీదుగా ఈ టీజర్ రిలీజైంది. డ్రగ్స్, పోలీస్ అధికారి హత్య చుట్టూ ఈ సినిమా తిరుగుతుందనే విషయాన్ని టీజర్ లో చెప్పారు. వీటితో పాటు తండ్రి సెంటిమెంట్ ను కూడా జతచేశారు. కారుకు కూడా ప్రత్యేకమైన రోల్ ఉన్నట్టు టీజర్ చూస్తే అర్థమౌతోంది. అలాగే హ్యాపీ డేస్ ఫేమ్ రాహుల్ టైసన్ కూడా కనిపిస్తున్నాడు.

టీజర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. కాకపోతే సినిమా కథకు సంబంధించి పెద్దగా ఎలిమెంట్స్ రివీల్ చేయలేదు. సస్పెన్స్, క్రైమ్, యాక్షన్ ఎలిమెంట్స్ ఉంటాయనే విషయాన్ని మాత్రం స్పష్టం చేశారు. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించి, ఆ వెంటనే ట్రయిలర్ ను లాంఛ్ చేస్తారు.

ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు ప్రశాంత్ రెడ్డి దర్శకుడు. ఈ సినిమాకు రథన్ పాటలు అందించగా.. కపిల్ కుమార్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు.