‘ఫ్యామిలీ’ చాలా పెద్దదే సుమా!

విజయ్ దేవరకొండ- పరుశురామ్ కాంబినేషన్‌లో దిల్ రాజు నిర్మించిన సినిమా ఫ్యామిలీ స్టార్. మరో వారం రోజుల్లో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో ఫ్యామిలీ స్టార్ ట్రయిలర్ ను విడుదల చేసారు. రెండు నిమిషాల ఇరవై ఆరు సెకెండ్ల నిడివితో వచ్చిన ట్రయిలర్ ఇది.

కానీ ట్రయిలర్ లో కంటెంట్ చూస్తే మాత్రం చాలా పెద్ద ట్రయిలర్ ను కట్ చేసారు అన్న భావన కలిగించింది. దీనికి కారణం ట్రయిలర్ లో చాలా ఎక్కువ కంటెంట్ ఇవ్వడమే. హీరో జీవితంలోని రెండు పార్శ్వాలు, హీరోయిన్ ట్రాక్, విలన్ వ్యవహారం ఇవన్నీ టచ్ చేసుకుంటూ వెళ్లడంతో పాటు, షాట్ బై షాట్ వేసుకుంటూ వెళ్లడంతో పెద్ద ట్రయిలర్ అనిపించేలా వుంది.

ఈ విషయం పక్కన పెడితే ట్రయిలర్ పక్కాగా టైటిల్ కు తగినట్లు ఫ్యామిలీ సినిమాలా వుంది. యూత్ ఫుల్ కంటెంట్ ను టచ్ చేస్తూనే ఫ్యామిలీలు సమ్మర్ లో థియేటర్ కు రావడానికి కావాల్సిన కంటెంట్ ను అందించారు. అందువల్ల క్లీన్ ప్లస్ ఫ్యామిలీ ట్రయిలర్ అనే ఇంప్రెషన్ వచ్చింది. అయితే విజయ్ దేవరకొండ యాంగిల్ లో చూస్తే, సినిమాకు వీర క్రేజ్ తీసుకువచ్చేంత మాదిరిగా మాత్రం ట్రయిలర్ లేదు. సినిమా విడుదలైన తరువాత గీత గోవిందం మాదిరిగా మారిపోతే అది వేరే సంగతి.

అంతకు ముందుగా విజయ్ కు వున్న యూత్ ఫాలోయింగ్ ను సినిమా కు ఓపెనింగ్ క్రేజ్ గా మార్చడానికి ఈ ట్రయిలర్ సరిపోకపోవచ్చు. గోపీసుందర్ బ్యాక్ గ్రవుండ్ స్కోర్ బాగుంది. ప్రొడక్షన్ ఖర్చు కనిపిస్తోంది.