భోళాశంకర్ కు షాకిచ్చిన శ్రియ?

చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం భోళాశంకర్. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉంది. ఈ ఐటెంసాంగ్ కోసం శ్రియను సెలక్ట్ చేశారనే విషయాన్ని ఇంతకుముందే చెప్పుకున్నాం. శ్రియ కూడా చిందేయడానికి దాదాపు ఒప్పుకుంది. కాకపోతే ఓ చిన్న మెలిక పెట్టింది. దాంతో యూనిట్ ఇప్పుడు విలవిల్లాడుతోంది.

భోళాశంకర్ లో చిరంజీవి సరసన స్పెషల్ సాంగ్ లో డాన్స్ చేసేందుకు ఏకంగా 75 లక్షలు డిమాండ్ చేసిందట శ్రియ. ప్రస్తుతం ఈ మొత్తానికి చాలామంది హీరోయిన్లు ఏకంగా సినిమాలే సైన్ చేస్తున్నారు. అలాంటిది శ్రియ, సింగిల్ సాంగ్ కోసం అంత మొత్తం డిమాండ్ చేయడంతో యూనిట్ ఖంగుతింది.

నిజానికి 20-25 లక్షల్లో శ్రియను సెట్ చేయాలని అనుకుందట యూనిట్. ఓ ఐటెంసాంగ్ కు అంతకుమించి రెమ్యూనరేషన్ ఇస్తే చాలా ఎక్కువ. కానీ ఒకేసారి 75 లక్షలు డిమాండ్ చేసి, చిన్నపాటి షాక్ ఇచ్చిందట ఈ సీనియర్ బ్యూటీ.

పూజాహెగ్డే, సమంత లాంటి స్టార్లు ఐటెంసాంగ్ చేసినప్పుడు ఇలా భారీగా ఛార్జ్ చేస్తుంటారు. పుష్పలో ఐటెంసాంగ్ కోసం సమంత, ఎఫ్3లో స్పెషల్ సాంగ్ కోసం పూజాహెగ్డే కాస్త ఎక్కువ తీసుకున్నారు. అంతగా క్రేజ్ లేని శ్రియ ఇంత డిమాండ్ చేస్తుందని యూనిట్ కలలో కూడా ఊహించలేదు. మరి శ్రియ చెప్పిన రేటు ఎంతకు తెగుతుందో చూడాలి.