పులేశం కడుతున్న ‘దసరా’

తొండ ముదిరితే ఊసరవిల్లి అన్నట్లుగా తయారవుతున్నట్లు కనిపిస్తోంది ‘దసరా’ సినిమా వ్యవహారం. అసలు హీరో నాని మార్కెట్ అంచనా వేయకుండానే 65 కోట్ల ఖర్చు చేస్తున్నారు. పోనీ అలా అని కమర్షియల్ సబ్జెక్ట్ నా అంటే విడుదలయ్యాక తెలియాల్సిందే.

రంగస్థలం సినిమా లాంటి రఫ్ అండ్ రగ్డ్ సినిమా. సింగరేణి నేపథ్యంలో, కులాల గొడవల బ్యాక్ డ్రాప్ లో రాసుకున్న కథ అన్నది ఇన్ సైడ్ టాక్. ఇలా రంగస్థలం తరువాత ఫాలో..ఫాలో అన్నట్లు అనుకుంటే… ఇది చాలక పుష్ప టైపులో నాని గెటప్..స్టిల్స్. సరే, అది అయిపోయింది అనుకుంటే..ఇప్పుడు రెండు భాగాలు అంటూ బయ్యర్లకు ఫీలర్ వదులుతున్నారు.

ఓవర్ సీస్ లో సినిమాను ఎలాగైనా అమ్మేసుకోవాలన్న కోరికతో, రెండో పార్ట్ వుందనే ఫీలర్ పుట్టించారు. ఇది పుట్టించింది ఓవర్ సీస్ బయ్యర్లు యుఎస్ లో కిందకు అమ్మేసుకోవడానికి అంట. తీరా అది బయట స్ప్రెడ్ అయ్యేసరికి ఇప్పుడు తూచ్ అంటున్నారు. కానీ అసలు విషయం ఏమిటంటే, ఇప్పటి వరకు తీసిన సినిమా యాజ్ ఇట్ ఈజ్ గా విడుదల చేసేస్తారట. చివర్లో చిన్న ట్విస్ట్ ఇచ్చే ఆలోచన చేస్తున్నారట. విలన్ కొడుకు విలన్ గా మారే ట్విస్ట్ ఇచ్చి క్లోజ్ చేసి, రెండో భాగం వుందనే ఫీల్ కలిగిస్తారట.

అంటే సినిమా హిట్ అయితే మరో భాగంతో ముందుకు వెళ్లొచ్చు. లేదంటే లేదు అనే టైపులో అన్నమాట. ఏమిటో నానితో చక్కా మంచి ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్ చేసుకుంటే ఏ టెన్షన్ వుండేది కాదు. ఇప్పుడు అన్నీ కలిపి 70 కోట్ల బిజినెస్ అయింది అనుకుంటే 65 కోట్లకు పైగా కొత్త దర్శకుడిని నమ్మి ఖర్చు చేసేస్తున్నారు. ఇప్పుడు ఓవర్ సీస్ బయ్యర్లు ఫుట్టిస్తున్న ఫీలర్లు ప్లస్ అవుతాయో, మైనస్ అవుతాయో చూడాలి.