మహేష్ సినిమాకు సమస్య అదే

ఎంత త్వరగా పూర్తి చేసి ఎంత త్వరగా రాజ‌మౌళి సినిమా మీదకు వెళ్దామా అని సూపర్ స్టార్ మహేష్ కు వుండొచ్చు. అలాగే ఎంత త్వరగా పూర్తి చేసి తరువాత సినిమా మీదకు వెళ్దామా అని త్రివిక్రమ్ కూడా వుండొచ్చు. కానీ పరిస్థితులు అనుకూలించాలి కదా. అదే అసలు సమస్య. ఒకంతట కథ సెట్ కాలేదు. అది అయ్యే లోపు,,అయిన తరువాత మహేష్ ఇంట్లో విషాదాల మీద విషాదాలు. అవన్నీ గడిచాయి. అంతా సెట్ అయింది.

కానీ ఇప్పుడు కాంబినేషన్ ఆర్టిస్ట్ ల డేట్ లు సెట్ కావాలి. అవి ఏదో విధంగా సెట్ చేస్తారు అనుకుంటే..క్రిస్మస్..న్యూ ఇయర్..సంక్రాంతి సెలవులు వస్తున్నాయి. వీటిలో చాలా వాటికి ఇండస్ట్రీ జ‌నాలు ప్రిఫెరెన్స్ ఇస్తారు. సంక్రాంతికి అయితే షూటింగ్ లు కచ్చితంగా నిలిచిపోతాయి. 

కనీసం 100 వర్కింగ్ డేస్ కావాలి. ఆపై పోస్ట్ ప్రొడక్షన్ కు, పబ్లిసిటీకి తగినంత టైమ్ వుండాలి. ఇవన్నీ చూసుకుంటే కనీసం ఆరు నెలలు సమయం కావాలి. డిసెంబర్ 10 కి కాస్త అటు ఇటుగా మొదలుపెట్టినా, జూన్ దాటేస్తుంది.

అంటే సమ్మర్ దాటేస్తుంది. ఇక దసరా కోసం లేదా పోస్ట్ సమ్మర్ లో సరైన డేట్ కోసం చూడాలి. అందుకే ఆగస్టు 11 అనువైన డేట గా కనిపిస్తోంది. దాదాపు అయిదు రోజులు వరుస సెలవులు కనిపిస్తున్నాయి. అప్పటికి చాలా పెద్ద సినిమాలు అయిపోతాయి. దసరా దూరం వుంటుంది. అందుకే ప్రస్తుతానికి ఆగస్టు 11 నే మహేష్-త్రివిక్రమ్ సినిమా రావడానికి అవకాశం వుంది. అంతకన్నా ముందు రావడానికి చాన్సే లేదు.