విశ్వక్ సేన్ ఆ రాత్రి అక్కడ చిక్కాడా?

విశ్వక్ సేన్ లేటెస్ట్ సినిమా ప్రారంభం కాకుండానే వివాదాల్లో చిక్కుకుంది. దాదాపు ఆగిపోయింది. ఈ విషయంలో తప్పు ఎవరిది అంటే కోడి ముందా..గుడ్డు ముందా అన్నట్లు వుంది గొడవ. విశ్వక్ సేన్ వైపు నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. నిర్మాత, సీనియర్ అర్జున్ ఓపెన్ గా ఏం జరిగిందో చెప్పేసారు. ఈ నేపథ్యంలో తప్పంతా విశ్వక్ సేన్ వైపే వున్నట్లు టాలీవుడ్ లో వినిపిస్తోంది.

సినిమా ఒప్పుకున్న తరువాత, కథ విన్న తరువాత సెట్ మీదకు వెళ్లాలి తప్ప, తరచు క్యాన్సిల్ కొట్డడం అన్నది సరి కాదు. పైగా రాత్రి వస్తానని చెప్పి, తెల్లవారు ఝామున రాను అని మెసేజ్ పెట్టడం అస్సలు సరికాదు. ఈ నేపథ్యంలో ఓ గుస గుస వినిపిస్తోంది. ఇలా రాత్రి వస్తానని చెప్పి, తెల్లవారు ఝామున రాను అని మెసేజ్ పెట్టడానికి మధ్యలో విశ్వక్ ఓ టాప్ స్టార్ తో నైట్ పార్టీలో వున్నారని గ్యాసిప్ వినిపిస్తోంది.

రీసెంట్ గా ఓ భారీ మల్టీస్టారర్ చేసి పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చుకున్న ఓ టాప్ హీరో ఇంట్లోనే విశ్వక్ ఆ రోజు నైట్ అంతా వుండిపోవాల్సి వచ్చిందని గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి. అందువల్లే అలా క్యాన్సిల్ కొట్టారని టాక్. మరో రెండు సార్లు ఏం జరిగింది అన్నదాని మీద మాత్రం గ్యాసిప్ లు వినిపించడం లేదు. అయితే విశ్వక్ అసలు తన సినిమాల షూటింగ్ టైమ్ లే డిఫరెంట్ గా వుంటాయని, లేట్ మార్నింగ్ వెళ్లి, ఈవెనింగ్ క్లోజ్ చేస్తారని కొందరు అంటున్నారు.

ఓ పక్క విశ్వక్ పని తీరు మీద గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి. మరోపక్క ఒకసారి సెట్ కు వస్తే మాత్రం చాలా పద్దతిగా వుంటారని మరోపక్క వినిపిస్తోంది. కానీ గమ్మత్తేమిటంటే హీరోలు ఎవరైనా కావచ్చు. ఇకపై ఏదీ టేకిట్ గ్రాంటెడ్ గా తీసుకోకుండా వుంటే బెటర్ అన్న కామెంట్లు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.