రాఙశేఖరా..ఎంత పని ఙరిగింది!

డిజిటల్ వరల్డ్ లో ఏది నిజ‌మో..ఏది ఫేక్ అన్నది అంత సులువుగా డిసైడ్ చేయలేము. ఫేక్ అని డిసైడ్ చేసే లోగానే ప్రపంచం అంతా తిరిగేస్తుంది. కొత్త దర్శకుడు, పాత ఎడిటర్ ఎస్ ఆర్ శేఖర్ పరిస్థితి ఇదే. 

ఆయన ట్వీట్ లే అంటూ కొన్ని సంచలన కామెంట్లతో కూడిన ట్వీట్ లు చలామణీ అయ్యాయి. అవన్నీ ఫేక్ అని రోజే ఖండించారు. సైబర్ క్రైమ్ ఫిర్యాదు కూడా చేసారు. కానీ అదేమయిందో? ఎంత వరకు వచ్చిందో తెలియడం లేదు.

కానీ సినిమాకు ఎక్కడ డ్యామేజ్ చేస్తుందో ఈ వ్యవహారం అని హీరో నితిన్ తెగ టెన్షన్ పడుతున్నారు. సాధారణంగా సినిమా విడుదలకు ముందు హీరో మీడియా మీట్ లు పెట్టడం, మాట్లాడడం, ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం మామూలే. కానీ ఈసారి అందరు మీడియాను పిలిస్తే ఎవరికి తోచినవి వారు అడిగేస్తారు. ఏదో ఒకటి చెప్పాలి. అలా చెబితే లేనిపోని తంటా. ఎందుకు వచ్చింది అని ప్రచారానికే ఫుల్ స్టాప్ పెట్టేసాడట నితిన్.

జ‌స్ట్ నాలుగు అంటే నాలుగు పత్రికల వారిని, రెండు చానెళ్లను మాత్రం పిలిచి మాట్లాడి పంపించాడట. ఇక ఏ మీడియా వద్దు అని, వాళ్లు ఏదేదో అడిగితే, ఏదో మాట్లాడితే లేని పోని తలకాయనొప్పి అని నితిన్ భావించడం వల్లనే ఈ ముందు జాగ్రత్త అని తెలుస్తోంది.