జగన్ ముందు చూపుని ఇప్పుడైనా మెచ్చుకుంటారా..?

థర్డ్ వేవ్ టైమ్ లో మిగతా చోట్ల స్కూళ్లు మూసేశారు, ఏపీలో ఎందుకు నిర్వహిస్తున్నారంటూ ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టాయి. ఓ దశలో నారా లోకేష్ మరీ ఓవర్ చేశారు. కానీ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితి ఏంటి..? కేసులు తగ్గుతుండే సరికి ఆంక్షలు కూడా తగ్గిపోతున్నాయి. 

ఢిల్లీ, కర్నాటకలో వీకెండ్ లాక్ డౌన్ తీసేశారు. తమిళనాడులో ఫిబ్రవరి 1నుంచి స్కూల్స్ తిరిగి మొదలు పెడుతున్నారు. మిగతా రాష్ట్రాలు కూడా ఇదే ఆలోచనలో ఉన్నాయి. మరి ఏపీలో అన్ని జాగ్రత్తలతో స్కూల్స్ నిర్వహిస్తున్న జగన్ ని ఇప్పుడు ప్రతిపక్షాలు మెచ్చుకుంటాయా. కరోనా భయంలో కూడా స్కూళ్లకు తాళం వేయకుండా ముందు చూపుతో వ్యవహరించిన జగన్ ని అభినందిస్తాయా..?

కళ్లెక్కడున్నాయ్ లోకేష్.. ట్విట్టర్ లోనా..?

లోకేష్ ఇప్పుడేమంటారు అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. స్టాలిన్ కి లేఖ రాస్తారా..? అయ్యయ్యో వద్దయ్యా.. అప్పుడే స్కూళ్లెందుకు తెరుస్తారయ్యా అంటూ ఆయనకి సూచనలు ఇస్తారా..? పోనీ కర్నాటక సీఎంకు స్కూళ్ల విషయంలో తొందరపడొద్దని చెబుతారా..? రేపు తెలంగాణలో కూడా స్కూల్స్ తెరుస్తారు, లోకేష్ అప్పుడేమంటారు. 

తాను నివశిస్తున్న రాష్ట్రం కదా అని కేసీఆర్ కి సలహా ఇచ్చే సాహసం చేస్తే.. అప్పుడుంటాయి టీఆర్ఎస్ నుంచి కౌంటర్లు. జగన్ స్పందించడం లేదు కదా అని.. ట్విట్టర్లో ఇష్టమొచ్చినట్టి పోస్టింగ్ లు పెట్టి, స్కూల్ పిల్లల తల్లిదండ్రుల్లో ఆందోళన పెంచిన లోకేష్ కి ఇప్పుడు సోషల్ మీడియాలో గట్టిగా కౌంటర్లు పడుతున్నాయి.

పారాసెట్మాల్ గురించి ఏపీ సీఎం జగన్ ఫస్ట్ వేవ్ సమయంలోనే గొప్పగా చెప్పారు. అప్పుడది కామెడీ అయింది, ఇప్పుడు డోలో ట్యాబ్లెట్ల అమ్మకాలు పెరిగాయని తెలుసుకుని ఓహో అనుకుంటున్నాం. చాలా రాష్ట్రాలు థర్డ్ వేవ్ భయంలో స్కూల్స్ మూసేస్తే ఏపీలో ఎందుకు ఆ పని చేయలేదని ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టాయి. 

సమర్థంగా వ్యాక్సినేషన్ పూర్తవుతున్న ఏపీ కూడా థర్డ్ వేవ్ కి భయపడి స్కూల్స్ మూసేస్తే ఇక టీకాకు అర్థమేముంటుంది. టీనేజ్ వ్యాక్సిన్లో కూడా ఏపీ ముందంజలో ఉంది. మరి వాటి ఫలితాలు అందుకోవాలంటే స్కూళ్లు తెరవాల్సిందే కదా.

పక్కింట్లో పస్తులున్నారని, మనింట్లో అన్నం మానేయలేం కదా. ఈ విషయం లోకేష్ కి అర్థమౌతుందా. గతంలో పరీక్షలు రద్దు చేసినప్పుడు లోకేష్ తన పచ్చ బ్యాచ్ తో తన చిత్రపటాలకు పాలాభిషేకాలు చేయించుకున్నారు. మరిప్పుడు పొరుగు రాష్ట్రాలు ఏపీని ఫాలో అవుతుంటే జగన్ కి పాలాభిషేకాలు చేయాలి కదా..? ఏమంటావ్ లోకేష్? ఊ అంటావా..? ఊఊ అంటావా..??