ఆర్చరీ క్రీడ కాదు విద్య

స్పోర్స్ డ్రామా నేపథ్యంలో తయారైన సినిమా లక్ష్య. నాగశౌర్య హీరోగా నటించిన ఈ సినిమా ట్రయిలర్ బయటకు వచ్చింది. కేవలం స్పోర్స్ డ్రామా అనే కాకుండా అన్ని రకాల ఎమోషన్లు పెర్ పెక్ట్ గా మిక్స్ చేసినట్లు కనిపిస్తోంది. 

నాగశౌర్య పెర్ ఫిక్ట్ గా కనిపించాడు. నారాయణ్ దాస్ నారంగ్ తదితరులు నిర్మించిన లక్ష్య సినిమా ట్రయిలర్ ను విక్టరీ వెంకటేష్ విడుదల చేసారు. ఈ సందర్భంగా డైరెక్టర్ సంతోష్ మాట్లాడుతూ.. ‘ఆర్చరీ మీద మొదటి సినిమా. క్రికెట్ అంటే ఓ మతం. ఓ దేవుడు అని అంతా అనుకుంటారు. ఎన్నో ప్రాచీన విద్యలు మరుగున పడుతున్నాయి. మనం దేవుళ్లుగా కొలిచేవారి చేతిలో, వీరులుగా చెప్పుకునే వారి చేతిలో విల్లును చూస్తాం. ఇది అంత గొప్పది. అన్నింటిని ఆటలు అంటాం. కానీ ఆర్చరీని మాత్రం విలు విద్య అని అంటాం.

నేను రాసుకున్నది నలభై శాతం అయితే.. వంద శాతాన్ని చేసింది నాగ శౌర్య. ఆయన లేకుంటే ఈ సినిమా ఇంత బాగా వచ్చేది కాదు. నిర్మాణ పరంగా నిర్మాతలు సహకరిస్తే.. కథను, పార్థు అనే  పాత్రను నాగ శౌర్య నెక్స్ట్ లెవెల్‌కు నాగ శౌర్య తీసుకెళ్లారు. 

విలుకాడికి సిక్స్ ప్యాక్ అవసరమా? అని అంతా అన్నారు. కానీ విల్లు ఎంత ఫ్లెక్సిబిలిటీగా ఉంటుందో అలా బాడీ కూడా ఉండాలి. మూడు రోజులు కనీసం పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోలేదు. కనీసం ఆయన ఉమ్ము కూడా మింగలేదు. 8 ప్యాక్ కోసం మూడు రోజులు అలానే ఉండిపోయారు అని అన్నారు..

నాగ శౌర్య మాట్లాడుతూ.. ‘ఈ సినిమా కోసం రెండున్నరేళ్లుగా కష్టపడ్డాం. నిర్మాతలు నారాయణ్ దాస్ కే నారంగ్, పుస్కర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్‌లతో పని చేయడం ఆనందంగా ఉంది. ఈ సినిమా చేద్దాం సర్ అంటూ చిన్నపిల్లాడిలా అడిగేవాడిని. ఏమైనా కష్టపెట్టి ఉంటే నన్ను క్షమించండి. కాళ భైరవ నా స్నేహితుడు. ఐదారేళ్ల నుంచి పని చేయాలని అనుకున్నాం. ఇప్పుడు ఇలా కుదిరింది. ఆర్ఆర్ మాత్రం అదరగొట్టేశాడు. కేతిక శర్మని చూస్తే ఎవ్వరికైనా సరే రొమాన్స్ చేయాలనిపిస్తుంది. ఒకేసారి సినిమా సినిమాకు లుక్ మార్చడం చాలా కష్టంగా అనిపించింది. కోహ్లీ గారికి కూడా సిక్స్  ప్యాక్ ఉంటుంది. క్రికెట్‌కు సిక్స్ ప్యాక్ అవసరం లేదు. మన మైండ్ ఎంత స్ట్రాంగ్‌గా ఉందని చెప్పడానికి ఫిట్ నెస్ ఉపయోగపడుతుంది. ఈ కథ నన్ను 8 ప్యాక్స్ కోరింది. నేను చేశాను. ఒక వేళ కారెక్టర్ డిమాండ్ చేస్తే పది పలకల దేహాన్ని కూడా చేస్తాను’ అని అన్నారు.