లవ్.. ఎమోషన్.. ఫ్రెండ్ షిప్.. మోసం.. లక్ష్య

లక్ష్య సినిమాలో కోర్ ఎలిమెంట్స్ ఏంటి? ఈ ప్రశ్నకు సమాధానం ఈరోజు రిలీజైన ట్రయిలర్ లోనే ఉంది. సినిమా కథ ఏంటి? ఏఏ అంశాల చుట్టూ తిరుగుతుంది? హీరో క్యారెక్టరైజేషన్ ఏంటి లాంటి అంశాల్ని ఈరోజు రిలీజైన ట్రయిలర్ లో డీటెయిల్డ్ గా చర్చించారు. 

బేసిగ్గా లక్ష్య సినిమాలో ఆటతో పాటు.. ప్రేమ, స్నేహం, మోసం లాంటి భావోద్వేగాల్ని చూపించారు. దీంతో ఇది కేవలం స్పోర్ట్స్ డ్రామా మాత్రమే కాదనే విషయంపై క్లారిటీ ఇవ్వగలిగారు మేకర్స్.

లక్ష్య మూవీ టీజర్ రిలీజైనప్పుడు మరో అర్జున్ రెడ్డిలా ఉందన్నారు చాలామంది. బహుశా ఆ రిమార్క్ నుంచి బయట పడేందుకు ట్రయిలర్ లో చాలా అంశాల్ని చొప్పించినట్టున్నారు. ట్రయిలర్ లో శౌర్య మరోసారి తన సిక్స్ ప్యాక్ బాడీ చూపించాడు. సినిమాలో అతడు రెండు లుక్స్ లో కనిపించబోతున్నాడనే విషయాన్ని కూడా ట్రయిలర్ లో రివీల్ చేశారు.

ఈ సినిమాను చాలా నమ్మాడు నాగశౌర్య. దీని కోసమే కష్టపడి సిక్స్ ప్యాక్ సాధించాడు. కేతిక శర్మ మరోసారి గ్లామరస్ గా కనిపించగా.. కీలక పాత్రలన్నింటినీ ట్రయిలర్ లో పరిచయం చేశారు. కాలభైరవ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది.

సంతోష్ జాగర్లపూడి డైరక్ట్ చేసిన ఈ సినిమాను డిసెంబర్ 10న విడుదల చేయబోతున్నారు. శ్రీ వేంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పి, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్లపై తెరకెక్కింది లక్ష్య.