5 నిమిషాలు ఏడిస్తే చాలు: పూజా హెగ్డే

ఒత్తిడి, నిరాశ, నిస్పృహ అనేవి ఎవరికైనా కామన్. ప్రతి ఒక్కరు ఏదో ఒక టైమ్ లో అది అనుభవించే ఉంటారు. నిత్యం బిజీగా ఉండే పూజా హెగ్డేకు కూడా ఇవి కొత్తకాదు. వరుస సినిమాలతో ఎప్పుడూ ఒత్తిడి ఫీలయ్యే ఈ హీరోయిన్.. మనసుకు బాధగా అనిపించినప్పుడు, ఒత్తిడి ఫీల్ అయినప్పుడు 5 నిమిషాలు ఏడుస్తానంటోంది. సంగీతం వింటానంటోంది.

"ఒత్తిడిలో ఉన్నప్పుడు సంగీతమే నాకు మందు. నా బెస్ట్ ఫ్రెండ్ మ్యూజిక్కే. మానసికంగా బాగాలేనప్పుడు సంగీత ప్రపంచంలో మునిగిపోతాను. దీంతో పాటు ఏడుపు కూడా బాగా పనిచేస్తుంది. 5 నిమిషాల్లో మనసులో ఉన్న బాధ మొత్తాన్ని బయటకు పంపించేస్తుంది. ఆ వెంటనే తిరిగి పనిలో పడిపోతాను."

ఇలా ఒత్తిడిలో ఉన్నప్పుడు తను ఏం చేస్తుందనే విషయాన్ని బయటపెట్టింది పూజా హెగ్డే. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో బిజీ హీరోయిన్ గా కొనసాగుతున్న ఈ బ్యూటీ.. అన్ని సినిమాల్ని ఒకేసారి మేనేజ్ చేయడం కోసం నిద్ర తగ్గించుకుంటున్నట్టు తెలిపింది.

"కాస్త తక్కువగా పడుకొని, వీలైనంత ఎక్కువగా విమాన ప్రయాణాలు చేస్తున్నాను. ఇదంతా సినిమా మీద ప్రేమ. ప్రస్తుతం నేను చేస్తున్న పనిని పూర్తిగా ఆస్వాదిస్తున్నాను. అదే నాకు ఉత్సాహాన్నిస్తోంది. ఎంత పని చేస్తే అంత ఆనందం నాకు."

ఫ్రీ టైమ్ లో నెటిజన్లతో టచ్ లోకి వచ్చిన ఈ బ్యూటీ.. చాలా విషయాలు మాట్లాడింది. ఆచార్యలో నీలాంబరి పాత్ర చాలా బాగుంటుందని, ఇక ప్రభాస్ తో చేసిన రాధేశ్యామ్ మూవీని ఎపిక్ లవ్ స్టోరీగా చెప్పుకొచ్చింది.