కార్య‌క‌ర్తలు సైసై...అధినేత నైనై

ఎక్క‌డైనా కార్య‌క‌ర్త‌ల్లో రాజ‌కీయ పార్టీ అధినేత ఉత్సాహం నింప‌డం చూస్తుంటాం. కానీ జన‌సేన విష‌యంలో అందుకు పూర్తి రివ‌ర్స్‌. కార్య‌క‌ర్త‌ల‌ను నిరుత్సాహ‌ప‌రిచేందుకు జ‌న‌సేనాని ప‌వ‌న్ నిత్యం ప్ర‌య‌త్నిస్తుంటారు. 

ఇదే సంద‌ర్భంలో కార్య‌క‌ర్త‌లు మాత్రం ఉత్సాహంతో ఎన్నిక‌ల స‌మ‌రానికి సైసై అంటుండ‌డం గ‌మ‌నార్హం. తిరుప‌తి ఉప ఎన్నిక నేపథ్యంలో జ‌న‌సేన పార్టీలో ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి.

జ‌న‌సేన‌కు కాపులు అండ‌గా నిలిచిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో తిరుప‌తి పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో బ‌లంగా ఉన్న కాపు సామాజిక వ‌ర్గం ఓట్ల‌న్నీ గంపగుత్త‌గా ప‌డాలంటే త‌మ పార్టీ పోటీ చేయ‌డ‌మే ఉత్త‌మ‌మ‌ని జ‌న‌సేన నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు భావిస్తున్నారు.

జ‌న‌సేన రాజ‌కీయ వ్య‌వ‌హారాల క‌మిటీ (పీఏసీ) స‌మావేశం గురువారం తిరుప‌తిలో జ‌రిగింది. తిరుప‌తి ఉప ఎన్నికలో పోటీపై నాయ‌కులు అభిప్రాయాల‌ను ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, నాదెండ్ల మ‌నోహ‌ర్ అడిగి తెలుసుకున్నారు. 

ఈ సంద‌ర్భంగా జ‌న‌సేన నాయ‌కులు, కార్య‌క‌ర్తలు ఎట్టి ప‌రిస్థితుల్లోనూ తిరుప‌తి బరిలో జ‌న‌సేనే నిల‌చాల‌ని తేల్చి చెప్పారు. బీజేపీకి ఇక్క‌డ అంత సీన్ లేద‌ని అధినేత దృష్టికి తీసుకెళ్లారు. పైగా ఏపీ బీజేపీ నేత‌లు త‌మ‌ప‌ట్ల అనుస‌రిస్తున్న వైఖ‌రిపై అసంతృప్తి వ్య‌క్తం చేశారు.

బీజేపీకి సీటు కేటాయించి వారికి సహకరించాలంటే కుదిరే ప‌నికాద‌ని అధినేత‌కు తేల్చి చెప్పారు. అంద‌రి అభిప్రాయాల‌ను తెలుసుకున్న ప‌వ‌న్‌క‌ల్యాణ్ స్పందిస్తూ ... బీజేపీ -జ‌న‌సేన అభ్య‌ర్థే పోటీలో ఉంటార‌ని చెప్పారు. అయితే అభ్య‌ర్థి ఎవ‌ర‌నే విష‌య‌మై వారంలో తేల్చుతామ‌న్నారు. అభ్య‌ర్థి ఎవ‌రైనా స‌హ‌క‌రించాల్సిందేన‌ని ప‌వ‌న్ అన్నారు.

దీంతో ప‌వ‌న్ మ‌రోసారి బీజేపీకే మ‌ద్ద‌తు ప‌ల‌కాల‌ని చెబుతార‌నే ఆందోళ‌న నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల్లో క‌నిపించింది. త‌మ‌లో ఉత్సాహాన్ని అధినేత చంపుతున్నార‌నే అభిప్రాయాలు స‌మావేశంలో పాల్గొన్న కొంద‌రు నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు చెప్ప‌డం గ‌మ‌నార్హం. 

క‌థ మొత్తం బంగారం చూట్టే

క్రాక్ సినిమా బాలీవుడ్ లో ఆ హీరోతో తీస్తా