పక్కనే కూర్చుంటారు.. మెత్తగా దోచేస్తారు

ఇది సంప్రదాయ దొంగతనమే. ఇందులో ఏమంత హైటెక్ ఉండదు. కాకపోతే 'చేతివాటం' మాత్రం అమోఘం. తోటి ప్రయాణికుల్లా మనతో కలిసి ప్రయాణం చేస్తారు. కుదిరితే మాటమంతీ కలుపుతారు. కళ్లు మూసి తెరిచేలోపు జేబులు కొట్టేస్తారు. గుంటూరులో కొన్ని రోజులుగా దోపిడీలకు పాల్పడుతున్న ఇలాంటి ముఠాను మరోసారి పోలీసులు అరెస్ట్ చేశారు.

గుంటూరులోని నగరంపాలెం, ఫిరంగిపురం ప్రాంతాలకు చెందిన చరణ్, శౌరమ్మ, మేరికి ఇలాంటి పనులు చేయడంలో ఎంతో అనుభవం ఉంది. పిక్ పాకెటింగ్ లో వీళ్లు దాదాపు పీహెచ్డీ చేశారు. 

ఇంతకుముందే వీళ్లు అరెస్ట్ అయ్యారు. బెయిల్ పై వచ్చి మళ్లీ అదే 'వృత్తి'ని కొనసాగిస్తున్నారు. తాజాగా సదాశివరావు అనే వ్యక్తి నుంచి బంగారం దొంగిలించి మళ్లీ దొరికిపోయారు.

మేడికొండూరుకు చెందిన సదాశివరావు బంగారం తాకట్టు పెట్టడం కోసం పాలడుగులో బ్యాంక్ కు బయల్దేరాడు. కొంతదూరంలో ఉన్న ఆటో ఎక్కాడు. అప్పటికే అందులో 'పాసింజర్లు' ఉన్నారు. కానీ వాళ్లు ప్రయాణికులు కాదు, ఇంతకుముందు మనం చెప్పుకున్న దొంగలు.

ఆటో కొంతదూరం వెళ్లిన తర్వాత, పాలడుగు వైపు వెళ్లడం లేదని చెప్పిన డ్రైవర్ సదాశివరావును దించేశాడు. ఆటోదిగిన సదాశివరావు, తన జేబులో ఉన్న బంగారం దొంగతనం జరిగినట్టు గుర్తించాడు. వెంటనే పోలీసుల్ని ఆశ్రయించాడు.

సీసీటీవీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. చోరీ జరిగిన విధానం తెలుసుకొని, అది పాత నేరస్తుల చేతివాటం అనే విషయాన్ని ఈజీగా గుర్తించారు. నిందితుల్ని అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో ప్రశ్నించగా.. నిజంతో పాటు బంగారం కూడా బయటపడింది. 

క‌థ మొత్తం బంగారం చూట్టే

క్రాక్ సినిమా బాలీవుడ్ లో ఆ హీరోతో తీస్తా