పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనలకూ చంద్రబాబేనా?

చంద్రబాబు... ఆయనే చెప్పుకున్నట్లుగా సీనియర్ మోస్ట్ పొలిటీషియన్. తెలుగుదేశం పార్టీకి జాతీయ అధ్యక్షుడు. ఏపీ వ్యవహారాలు చూసేందుకు మరో ప్రెసిడెంట్ ఉన్నారు. ఇక జిల్లాలలోనూ అధ్యక్షులు ఉన్నారు. మరి ఇంత మందీ మార్బలం ఉండి కూడా ఒక పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకూ చంద్రబాబే రావాలా. ఆయనే కావాలా.

ఇది తమ్ముళ్ల అతి ఉత్సహమా. లేక వారి అతి దూకుడా అన్నది ఆలోచించాల్సిందే. శ్రీకాకుళం జిల్లాలోనే ఏపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు ఉన్నారు. అబ్బాయి రామ్మోహననాయుడు అయితే ఎంపీగా ఉన్నారు. కానీ సిక్కోలులో ఆందోళన చేయాలంటే బాబు రావాలట.

పలాసాలో ఓ టీడీపీ కార్యకర్త మీద పోలీసులు కేసు పెట్టి అరెస్ట్ చేశారు. దాంతో మండిపోయిన రామ్మోహన్ నాయుడు పోలీస్ స్టేషన్ కి వచ్చారు. ఆందోళన చేశారు. పలాసాలో ప్రజాస్వామ్యం లేదని కూడా గట్టిగానే కామెంట్స్ చేశారు. అక్కడ వైసీపీ మంత్రిదే రాజ్యమంటూ నిందించారు.

ఇదంతా బాగానే  ఉన్నా తమ కార్యకర్తను అన్యాయంగా అరెస్ట్ చేశారని, ఆయన్ని విడిపించకపోతే ఏకంగా చంద్రబాబే వచ్చి పలాసా పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేస్తారంటూ రామ్మోన్నాయుడు చెప్పడమే విడ్డూరం. 

ఏదైనా ఆందోళన చేయడానికి లోకల్ లీడర్స్ లేరా. లేక అచ్చెన్న సరిపోరా. మరీ వీధి గొడవలకు కూడా జాతీయ అధ్యక్షుడే రావాలా. లేక ఎటూ రామతీర్ధాలుకు బాబు వచ్చారు కాబట్టి ఇకపైన ప్రతీ వూరిలో జరిగే ఉద్యమాలను ఆయనే ముందుండి నడిపించాలని తమ్ముళ్ళు ఉబలాటపడుతున్నారా. మొత్తానికి చంద్రబాబు పేరు చెప్పి వైసీపీని తమ్ముళ్ళు బెదిరిస్తున్న తీరు పెద్ద చర్చగానే ఉందిపుడు.

జ‌య‌మ్మ క్యారెక్ట‌ర్ ఇంత బాగా రావడానికి కార‌ణం అయ‌నే

ఏపీలో కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రారంభం