పెళ్లి కూతురైన పూజా హెగ్డే

ప్ర‌ముఖ హీరోయిన్ పూజా హెగ్డే పెళ్లి కూతురిగా ముస్తాబ‌య్యారు. చేతికి మెహందీ పెట్టుకుని, బంగారు వ‌ర్ణ‌పు దుస్తుల్లో ముస్తా బైన పూజా చూపరుల‌ను క‌ట్టి ప‌డేశారు. కొత్త గెట‌ప్‌లో క‌నిపించిన బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే పెళ్లి కూతురు కావ‌డం నిజ జీవితంలో మాత్రం కాదండోయ్‌. ఓ సినిమాలో అని గుర్తించుకోండి.

లాక్‌డౌన్ కార‌ణంగా షూటింగ్స్ బంద్ అయిన విష‌యం తెలిసిందే. దీంతో సినీ సెల‌బ్రిటీలు త‌మ త‌మ ఇళ్ల‌కే ప‌రిమిత‌మై పాత ఫొటోల‌ను , వీడియోల‌ను బ‌య‌టికి తీసి సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులకు వినోదాన్ని పంచుతున్నారు. స‌రికొత్త అవ‌తారంలో తాజాగా పూజా హెగ్డే సోష‌ల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోలు...ఆమె న‌టించిన "హౌస్ ఫుల్‌-4"కు సినిమాకు సంబంధించిన రెండు స్టిల్స్‌. ఈ రెండు ఫొటోల్లో ఆమె పెళ్లి కూతురు గెట‌ప్‌లో దిగడాన్ని గ‌మ‌నించ‌వ‌చ్చు.

"హౌస్ ఫుల్‌-4"కు సంబంధించి ఓ మ‌ధుర జ్ఞాప‌కం. సంగీత్ డ్రెస్‌లో ఇలా...అని ఆమె క్యాప్ష‌న్ పెట్టారు. పెళ్లి కూతురి గెట‌ప్‌లో ఉన్న ఈ బుట్ట‌బొమ్మ నెటిజ‌న్ల‌ను ఫిదా చేశారు. వావ్‌...పూజా సూప‌ర్బ్ అని కొంద‌రు, క్యూటీ అని మ‌రికొంద‌రు త‌మ‌త‌మ అభినం ద‌న‌ల‌తో కూడిన అభిప్రాయాల‌ను వ్య‌క్త‌ప‌రిచారు. 

బ్రహ్మాండమైన సంక్షేమ సంవత్సరంగా తొలి ఏడాది