'నాథూ' బాబు!

నా పేరు:  కొణిదెల నాగేంద్ర బాబు ఎలియాస్ నాగబాబు.

దరఖాస్తు చేయు ఉద్యోగం: ‘దేశభక్త’ పరిశోధకుడు. (చరిత్ర విస్మరించి చెత్తబుట్టలో పడవేసిన వారిలోనూ, తుపుక్కున ఉమ్మేసి విసిరేసిన వారిలోనూ ‘దేశభక్తులు’ వుండవచ్చు. ఆ బుట్టలో వేలు పెట్టటం ఇబ్బందే. అయినా చేస్తున్నాను. కారణం నేను దేశభక్తుణ్ణి కాబట్టి.)

వయసు: చిన్న జోకుకయినా, పెద్దగా ఎగిరిపడి నవ్వే వయసు. (ఆడ వాళ్ళ మీద వేసిందా, మగవాళ్ళ మీద వేసిందా..నాకనవసరం.. అది జోకా? కాదా? దట్సాల్)

ముద్దు పేర్లు: ‘నాథూ’బాబు (నాథూరామ్ గాడ్సేను ‘దేశభక్తుడు’ అన్నాను. యస్ అంటాను. ‘అన్నయ్య’ ప్రజారాజ్యం పెట్టి ‘సామాజిక న్యాయం’ అన్నప్పుడు అంబేద్కర్ దేశభక్తుడిలా కనిపించాడు; ‘తమ్ముడు’ జనసేన పెట్టి, ‘చేగువేరా’ను తలచినప్పుడు ‘కమ్యూనిస్టులు’ దేశభక్తుల్లా అనిపించవచ్చు. ఇప్పుడు అదే తమ్ముడు ‘కాషాయం’ వైపు చూసినప్పుడు  గాడ్సేయే కాదు, గాడ్సేను సృష్టించిన ‘సైధ్ధాంతిక గురువులు’ కూడా దేశభక్తులుగా కనిపించవచ్చు.

విద్యార్హతలు: మాస్టర్ ఆఫ్ పేట్రియాటిజం. 

విలాసం: పొలిటికల్‌గా ఒకప్పుడు ‘కేరాఫ్ అన్నయ్య. ఇప్పుడు కేరాఫ్ తమ్ముడు. సొంత అడ్రసు లేదు. 

గుర్తింపు చిహ్నాలు: ఒకటి: చెయ్యెత్తు మనిషిని. ‘చెయ్యెత్తే’ మనిషి (అన్నయ్య, తమ్ముడూ ఏదంటే, దానికి.)
రెండు: ఎత్తుకు నేను.. నటనకు అన్నయ్యా, లేదా తమ్ముడూ.

సిధ్ధాంతం: ‘గాంధీయిజమూ’, ‘గాడ్సేయిజమూ’ కలిపి ఏదైనా సిధ్ధాంతం తయారు చేయాలని వుంది. ‘తమ్ముడు’ ద్వారా తెలిసింది. ఆల్రెడీ కనిపెట్టేశారని. దానిని వెతుక్కుంటూనే వెళ్ళాడని. ఎంతయినా ‘ఇజం’ రాసిన వాడు కదా! 

వృత్తి: నవ్వటం. (నవ్వుల పాలు కావటం కాదు.)

హాబీలు: 1.గుడ్డిగా నమ్మటం. ఎవర్నయినా సరే. కడకు అన్ననయినా, తమ్ముణ్ణి నయినా.
2.మాట్లాడాక ఆలోచించటం. (కీడెంచి ‘ట్వీట్’ ఎంచటం నాకు తెలీదు. 

అనుభవం: సంఖ్యలో నేను నటించిన చిత్రాలు ఎక్కువే. 

మిత్రులు: అభిమానులు వుంటారు. ‘అన్నయ్య’ ‘తమ్ముడు’ అభిమానుల్ని నా అభిమానులగానే భావిస్తాను. మిత్రులుండరు. 

శత్రువులు: గాడ్సే లాంటి ‘శాంతి దూత’ (ఇంకా ఈ మాట పైకి అనలేదు లెండి.)ను అనుసరించే వాడిని నేను. నాకు శత్రువులేమిటి? 

మిత్రశత్రువులు: ఆ తేడా తెలిస్తే వివాదాల్లో ఇరుక్కుంటానా? 

జీవిత ధ్యేయం: ‘గాడ్సే’ దేశభక్తుడని దేశమంతా చాటటం. 

సర్