ఒకే రోజు 6767 కేసులు.. అస్సలు తగ్గని కరోనా

దేశవ్యాప్తంగా కరోనా కేసులు ఎక్కడా తగ్గుముఖం పట్టడం లేదు.  ఏ రోజుకారోజు రికార్డులు క్రాస్ చేసుకుంంటూ కరోనా కేసులు నమోదవుతున్నాయి. నిన్న కూడా ఒకే రోజు 6767 కేసులు దేశవ్యాప్తంగా నమోదయ్యాయి. దేశంలో కరోనా వెలుగుచూసిన తర్వాత ఒకరోజులో నమోదైన కేసుల్లో ఇదే అత్యథికం. రేపు ఇంతకంటే ఎక్కువ కేసులు నమోదైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే 3 రోజులుగా ట్రెండ్ ఇలానే నడుస్తోంది.

తాజాగా నమోదైన 6767 కేసులతో కలుపుకొని దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 131,958కు చేరుకుంది. ఇప్పటివరకు 54,440 మంది కోలుకొని ఇళ్లకు వెళ్లినట్టు కేంద్రం ప్రకటించింది. అటు కరోనా వల్ల గడిచిన 24 గంటల్లో మరో 147 మంది మరణించారు. దీంతో దేశంలో మొత్తం మృతుల సంఖ్య 3867కు చేరింది.

ఇప్పటివరకు నమోదైన కేసుల్లో 93.24 శాతం కేసులు కేవలం 10 రాష్ట్రాల నుంచే వచ్చినట్టు కేంద్రం ప్రకటించింది. వీటిలో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, తమిళనాడు, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలున్నాయి. మరోవైపు వైరస్ నుంచి కోలుకుంటున్న వారి శాతం రోజురోజుకు పెరుగుతోందని, ప్రస్తుతం 41.28శాతంగా ఉందని ప్రకటించింది ప్రభుత్వం.

అటు మహారాష్ట్రలో శనివారం కొత్తగా మరో 2608 కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్క రోజే 60 మంది చనిపోయారు. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా సంఖ్య 47వేలు దాటగా.. 1577 మంది మృతిచెందారు. 

టాలీవుడ్ కు ఆంధ్ర ప్రభుత్వం అంతగా ఆనడం లేదు