అశోక్ కూడా అబద్దాలు చెబుతారా?

విజయనగరం పూసపాటి సంస్థానాధీశుడు, కేంద్ర మాజీ మంత్రి, చరిత్ర కలిగిన వంశం నుంచి వచ్చిన సిసలైన రాజు అశోక్ గజపతిరాజు అని పేరు. ఆయన ఇతరుల మాదిరిగా చిల్లర రాజకీయాలు చేయరు, మాట తూలరు అని కూడా పేరు. ఆయన మాటల్లో చేతల్లో నిబద్ధత ఉంటుంది అని కూడా అంటారు.

అటువంటి అశోక్ కూడా అబద్దాలు ఆడతారా అన్నదే ఇపుడు చర్చ.  ఇవన్నీ ఇలా ఉంటే అశోక్ బాబాయ్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన అన్న ఆనందగజపతిరాజు పెద్ద కుమార్తె, మాన్సాస్ ట్రస్ట్ చైర్ పర్సన్ సంచయిత గజపతిరాజు అంటున్నారు. దానికి చంద్రబాబునాయుడు వంత పాడుతున్నారని కూడా ఆమె ఆరోపించారు.

విజయనగరం పేరు చెప్పగానే ఠక్కున గుర్తుకు వచ్చేది ఈ మూడు లాంతర్ల జంక్షన్. అటువంటి దాన్ని పూర్తిగా ద్వంసం చేసేసి చరిత్రను పూర్తిగా నాశనం చేస్తున్నారని అశోక్ గజపతి ఆరోపించారు. ఆయన ఓ వీడియో కూడా పెట్టారు. ఆ వెంటనే చంద్రబాబు అందుకుని ఆ వీడియో చూస్తే గుండే తరుక్కుపోతోందని తెగ బాధపడిపోయారు. ఇదంతా అశోక్ సహా రాజుల ఆనవాళ్ళు కనిపించకుండా చేసే ప్రయత్నమేనని కూడా బాబు గారు విరుచుకుపడ్డారు.

ఇంతకీ జరిగింది ఏంటి అంటే విజయనగరం పట్టణ పునరుధ్ధణ పనులలో భాగంగా మూడు లాంతర్లతో పాటు, స్తంభాన్ని కూడా తీసి అధికారులు భద్రపరచారు. అంతే కాదు, అక్కడ అభివ్రుధ్ధి పనులు పూర్తి చేసిన వెంటనే తిరిగి ఆ మూడు లాంతర్లని ప్రతిష్టిస్తారు. ఇది జిల్లా కలెక్టరూ చెప్పారు. మూడు లాంతర్లు స్థంభాన్ని భద్రపరచిన గదిని ఫోటో తీసి మరీ ఆధారాలతో సహా సంచయిత కూడా మీడియాకు రిలీజ్ చేశారు.

మరి అబద్దాలు ఆడని అశోక్ ఎందుకు ఇలా తప్పుడు ప్రకటన చేశారన్నది ప్రశ్న.ఇక  బాబాయికి పూసపాటి రాజుల చరిత్ర మీద అంతలా విశ్వాసం ఉంటే 1869 నాటి మోతీమహల్ ని ఎందుకు ద్వంసం చేశారు. మాన్సాస్ చైర్మన్ గానీ ఈ పని చేసిన బాబాయ్ అశోక్ దీని మీద వివరణ ఇవ్వగలరా అంటూ అన్న కూతురు అడిగిన ప్రశ్నను బహుశా అశోక్ కూడా  ఊహించి ఉండరేమో.

టాలీవుడ్ కు ఆంధ్ర ప్రభుత్వం అంతగా ఆనడం లేదు