ఓటీటీ అనౌన్స్ మెంట్లు ఈ వారమేనా?

కరోనా టైమ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి వినిపిస్తున్నాయి కొన్ని ఓటిటి వార్తలు. కానీ ఇప్పటి వరకు మెటీరియలైజ్ కాలేదు. కానీ విశ్వసనీయ వర్గాల బోగట్టా ప్రకారం ఈ వారం ఒకటి రెండు సినిమాలు ఈవారం అమెజాన్ ప్రయిమ్ తో అగ్రిమెంట్ చేసుకునే అవకాశం వుందని తెలుస్తోంది. అనుకున్నవి అన్నీ అనుకున్నట్లు జరిగితే అనుష్క-పీపుల్స్ మీడియా సినిమా నిశ్శబ్దం ఈ వారం అగ్రిమెంట్ జరగొచ్చు అని వినిపిస్తోంది.

అలాగే కీర్తి సురేష్-ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ మిస్ ఇండియా కూడా ఇదే బాటలో పయనిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా ఇంకా డిస్కషన్ స్టేజ్ లో వుంది. ఈ సినిమాకు అన్నీ కలిపి 10 కోట్ల వరకు ఖర్చయింది. మరి అమెజాన్ ఆఫర్ ను బట్టి ముందుకు వెళ్లడం లేదా వేరే దారి పట్టడం అన్నది ఆధారపడి వుంటుంది.

థియేటర్లు కనీసం ఓ నెలలో ఓపెన్ అయినా సినిమాలు సెట్ కావడానికి కొంచెం టైమ్ పడుతుంది. అంతవరకు వేచి వుండే కన్నా, కాస్త మంచిరేటు వస్తే ఓటిటికి ఇచ్చుకోవడం బెటర్ అనే ఆలోచనలు సాగుతున్నాయి.

టాలీవుడ్ కు ఆంధ్ర ప్రభుత్వం అంతగా ఆనడం లేదు