కోన వెంకట్ డబుల్ స్టేట్ మెంట్

లాక్ డౌన్ టైమ్ లో ఎక్కువగా వినిపించిన పేరు నిశ్శబ్దం. ఈ సినిమా ఓటిటి ప్లాట్ ఫారమ్ లోకి వస్తుందని ఎక్కువగా వినిపించింది. కానీ ఆల్ మోస్ట్ లాక్ డౌన్ అయిపోతోంది కానీ ఏ విషయం క్లారిటీ రాలేదు. ఈ విషయంలో రకరకాల గ్యాసిప్ లు వినిపించాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆ సినిమా నిర్మాణంతో అంతో ఇంతో సంబంధం వున్న రచయిత కోనవెంకట్  వేసిన రెండు ట్వీట్ లు మరో ఎత్తు. 

ఆయన మూడు రోజుల తేడాతో రెండు ట్వీట్ లు వేసారు. 

We all came to Film industry with lot of passion and after many struggles.. Audience reactions to our work in THEATRES is our motivation and oxygen ... Nothing can match this feeling.. CINEMA is meant for Cinema Halls.. And that’s our “PRIORITY”.
....
Lot of speculations r being made on the release of our film NISHABDHAM in the media.We would like to clarify that “Theatrical release is our top PRIORITY.If the situation isn’t favourable for a long time then our alternate would be to release on OTT platform”. Hope for the bestThumbs up
...
ఇవీ ఆ ట్వీట్లు. మొదటి దాని ప్రకారం ఎట్టి పరిస్థితుల్లోనూ థియేటర్ లోకే వస్తుంది నిశ్శబ్ధం మూవీ అని అర్థం అవుతోంది. కానీ రెండో ట్వీట్ లో సబ్జెక్ట్ టు కండిషన్ అన్నట్లుగా వుంది వ్యవహారం.  ఇప్పటి పరిస్థితుల ప్రకారం ఆగస్టు నుంచి థియేటర్లు అంటున్నారు. అప్పుడు కూడా జనాలు ఎలా రెస్పాండ్ అవుతారో చూసి కానీ సినిమాలు వదలరు. అంటే సెప్టెంబర్. లేదా అక్టోబర్. మరి అన్ని రోజులు నిశ్శబ్దం నిర్మాతలు నిశ్శబ్దంగా వేచి వుంటారా? అందుకే కోన వెంకట్ ఈ సవరణ ట్వీటు వేసారని అనుకోవాలా?

ఇదిలా వుంటే సినిమాకు పెట్టుబడి పీపుల్స్ మీడియాది. కోనవెంకట్ షేర్ కలిసారా? ప్రాజెక్టు సెట్ చేసి, కథ తదితర వ్యవహారాలు చూసినందుకు భాగస్వామ్యం లభించిందా? అన్నది వారికే తెలియాలి. డబ్బు పెట్టిన వారికి నొప్పి వుంటుంది తప్ప, పెట్టని వారికి కాదు కదా..ఐ లవ్ థియేటర్ అని చెప్పడం సులువే. అసలు బాధ నిర్మాతది కదా? అనే కామెంట్లు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. అసలే థియేటర్ల ఆదాయం ఎలా వుంటుంది అన్నది ఊహకు అందడం లేదు. మామూలుగా వుండొచ్చు..లేదా ఉండకపోవచ్చు. ఇలాంటి టైమ్ లో రిస్క్ చేయడం అన్నా ఓటిటికి ఇచ్చుకోవడమే బెటర్ అనే ఆలోచన కనుక నిర్మాతలు చేస్తూ వుంటే, ఇలా ట్వీట్ ల ద్వారా వాళ్లను కన్ఫ్యూజ్ చేయడం ఎందుకో? మరి?

త్వరలోనే టాలీవుడ్ కి గుడ్ న్యూస్