ఆర్ఆర్ఆర్ విడుదల ఎప్పుడు?

ఆర్ఆర్ఆర్ 2020 సమ్మర్ కు రావడం లేదు...ఈ విషయం ముందుగా వెల్లడించింది గ్రేట్ ఆంధ్రనే.

ఆర్ఆర్ఆర్ 2021 సంక్రాంతికి కూడా రావడం లేదు. ఈ విషయం కూడా ముందుగా వెల్లడించింది గ్రేట్ ఆంధ్రనే.

ముందుగా కాదు, కాదు అన్నా, చివరకి అదే అంగీకరించారు. 

అయితే ఇప్పుడు పాయింట్ వేరు. అసలు 2021 సమ్మర్ కు ఆర్ఆర్ఆర్ వస్తుందా? అన్నది. 

ఆర్ఆర్ఆర్ లాంటి భారీ సినిమాకు మిగిలిన సీజన్లు రెండే రెండు. ఒకటి సంక్రాంతి. రెండు సమ్మర్.  దసరా అన్నది  ఈ రేంజ్ సినిమాకు సరిపోదు. ఆ విషయం గ్రహించే 2020 దసరాను వదిలి 2021 సంక్రాంతికి మార్చుకున్నది. కానీ ఇప్పుడు మరి 2021 సమ్మర్ కు ఆర్ఆర్ఆర్ రెడీ అవుతుందా? అన్నది ప్రశ్న.

యూనిట్ వర్గాల బోగట్టా ప్రకారం జూలై నుంచి షూటింగ్ లు ప్రారంభమైతే మార్చి నాటికి సినిమా రెడీ అయిపోవచ్చు అన్నది సమాచారం గా వుంది. కానీ ఇండస్ట్రీ ఇన్ సైడ్ వర్గాల బోగట్టా వేరుగా వుంది. ఇప్పటికి పెండింగ్ లో వున్న వర్క్ ప్రకారం జూలై నాటికి కానీ ఆర్ఆర్ఆర్ రెడీకాదు అని వినిపిస్తోంది. అలా అయితే మళ్లీ 2021 సమ్మర్ ను మిస్ అయిపోతారు.మరి లేటు అయిందని దసరాతో సరిపెట్టుకుంటారా? ఇంకా వెనక్కు వెళ్తారా? అన్నది ఇప్పట్లో సమాధానం దొరికే ఫ్రశ్న కాదు.

లాక్ డౌన్ పూర్తి కావాలి. షూటింగ్ ప్రారంభం కావాలి. విదేశాల నుంచి టెక్నిషీయన్లు, నటులు రావాలి. అప్పుడు ఓ అంచనా దొరకుతుంది. అన్నీ పాజిటివ్ గా వుండి జూలై 2021 కి ఆర్ఆర్ఆర్ రెడీ అయిపోతే ఓకె. లేదూ అంటే 20222 సంక్రాంతిని టార్గెట్ చేసుకుంటుందేమో? అన్న అనుమానాలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.

ఎన్టీఆర్ మూడేళ్లు లాక్

ఆర్ఆర్ఆర్ పుణ్యమా అని మంచి ఊపులో, టైమ్ లో వున్నపుడు ఎన్టీఆర్ లాస్ట్ సినిమా 2018 అక్టోబర్ లో వచ్చింది. 2021 జూలైకు ఆర్ఆర్ఆర్ వచ్చినా, దాదాపు మూడేళ్లు కేవలం ఒక్క సినిమా మీద గడిపేసినట్లు. ఇదే టైమ్ లో ఎన్టీఆర్ కనీసం నాలుగు సినిమాలు చేసి వుండేవారు. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ తరువాత త్రివిక్రమ్ డైరక్షన్ లో సినిమా చేయాల్సి వుంది. ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ వర్క్ ఎప్పుడు పూర్తి అవుతుందో? ఎప్పుడు త్రివిక్రమ్ సినిమా స్టార్ట్ అవుతుందో అన్నది ఇప్పట్లో సమాధానం దొరకని ప్రశ్న.

ఎన్టీఆర్ బర్త్ డే కు ఓ లుక్ విడియో కూడా రెడీ చేయలేకపోయారు. అంటే అసలు కంటెంట్ ఏమేరకు వుందో?లేదో? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

ప్రయాణాలకు ఏపీఎస్‌ ఆర్టీసీ సిద్ధం

కేసీఆర్ న్యూ రూల్స్ అదుర్స్