అయ్యప్పన్ చూస్తానన్న బాలయ్య

లాక్ డౌన్ టైమ్ లో కాస్త ఎక్కువే వినిపించిన  పేరు అయ్యప్పన్ కోషియమ్. ఈ సినిమా రైట్స్ ను సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ కోటి పదిలక్షలు ఇచ్చి కొనుగోలు చేసింది. బాలయ్య-రానా కాంబినేషన్ లో నిర్మించాలన్నది బేసిక్ ప్లాన్. అది సెట్ కాకపోతే, ఆల్టర్ నేటివ్ ప్లాన్ లు వుండనే వున్నాయి. అయితే ఎలాగైనా బాలయ్య-రానా కాంబినేషన్ లో నిర్మించాలనే 'సితార' కోరిక.

ఇప్పటికే ఈవిషయం బాలయ్యకు కన్వే చేసారు. ఆయన తాను ప్రసాద్ లాబ్ లో చూస్తానని, థియేటర్ లో చూస్తేనే పెర్ ఫెక్ట్ గా చెప్పగలనని, లాక్ డౌన్ అయ్యే వరకు వేచి వుండమని బాలయ్య చెప్పినట్లు తెలుస్తోంది. ఇక మలయాళణలో పృధ్వీరాజ్ చేసిన క్యారెక్టర్ కు రానానే పెర్ ఫెక్ట్ గా సూట్ అవుతారని నిర్మాతలు భావిస్తున్నారు. ఆ మేరకు డిస్కషన్లు సాగుతున్నాయి.

డైరక్టర్ ఎవరు?

ఇంతకీ ఈ హ్యూమన్ ఎమోషన్లు తారా స్థాయిలో వుండే ఈ సినిమాకు డైరక్టర్ ఎవరు.? ఇప్పటి వరకు ఆ విషయంలో ఫిక్స్ కాలేదు. సెకండ్ లెవెల్ లో వున్న టాప్ డైరక్టర్ ఎవరు సెట్ అవతారు అని ఆలోచిస్తున్నారు.  సినిమా మామూలు కమర్షియల్ సినిమా కాదు. భావోద్వేగాలు బలంగా తెరపై పండించగలగాలి. మైత్రీ-పవన్ కళ్యాణ్ సినిమా ఆలస్యం అవుతుందనుకుంటే హరీష్ శంకర్ అయితే ఎలా వుంటుంది?  రీమేక్ అన్న అభ్యంతరం లేకపోతే, సందీప్ వంగా అయితే ఎలా వుంటుంది. ఇలా సాగుతున్నాయి నిర్మాతల ఆలోచనలు అని తెలుస్తోంది. వన్స్ లాక్ డౌన్ అయిపోతే అన్నీ సెటిల్ అవుతాయి.

విద్యుత్‌ బిల్లులపై ప్రతిపక్షం దుష్ప్రచారం