పరిహారంపై పరిహాసం

మరణానికి పరిహారం ఎప్పుడూ ప్రత్యామ్నాయం కాదు. మనిషి లేని లోటను మనీ తీర్చలేదు ఎప్పటికీ. అయినా కూడా ప్రకృతి వైపరీత్యాలు, ప్రమాదాలు సంభవించినపుడు పరిహారం డిమాండ్ చేయడం, ప్రకటించడం రెండూ కామన్. ప్రతిపక్షాలు పరిహారం డిమాండ్ చేస్తాయి. ప్రభుత్వాలు ప్రకటిస్తాయి.  విశాఖ ఎల్ జి పాలిమర్స్ గ్యాస్ లీక్ వ్యవహారంలో ముఖ్యమంత్రి జగన్ కొన్ని గంటల్లో పరిహారం ప్రకటించారు. అది కూడా అత్యంత భారీగా. 

ఇదే వ్యవహారం ప్రతిపక్షానికి మింగుడు పడడం లేదు. తాము డిమాండ్ చేయలేదు. పోనీ విమర్శించాలంటే మృతుల కుటుంబాలకు ఏకంగా కోటి రూపాయలు ప్రకటించారు. ఈ విషయానికి నలువైపుల నుంచి మెచ్చుకోలు లభించేసరికి ప్రతిపక్షానికి ఏం చేయాలో పాలు పోలేదు. మరోపక్క విశాఖకు ప్రతిపక్షనాయకుడు వెళ్లలేని పరిస్థితి. దీని నుంచి తేరుకోవడానికి 24 గంటలు పట్టింది. 

దీంతో ఇప్పుడు కోటి రూపాయలు ఇస్తే పోయిన ప్రాణం వస్తుందా? వైఎస్ పోయినపుడు కోటి రూపాయలు ఇచ్చేసి వుంటే జగన్ కుసరిపోయేదాలాంటి ప్రశ్నలు. నిజమే కోటి రూపాయలు ఇస్తే పోయిన ప్రాణం తిరిగిరాదు. కానీ ఇంటికి ఆధారమైన వ్యక్తి పోయినపుడు పరిహారం ఇవ్వడం అన్నది ఆదుకోవడంలో ఓ విధానం. ఉద్యోగం ఇవ్వడం అన్నది కూడా ఇలాంటిదే.

ఇప్పుడు జగన్ కనుక, సరే, కోటి రూపాయలు ఇచ్చి మిమ్మల్ని బాధపెట్టను. పరిహారం క్యాన్సిల్ అంటే 11 మంది మృతుల కుటుంబాలు చంద్రబాబును ముందు విమరిస్తాయి. మీరు చేయరు. చేసేవాళ్లను చేయనీయరు అని. 

లేదా సరే పరిహారం వద్దు, ఎల్ జి పాలిమర్స్ ను దశల వారీగా అయిదేళ్లో తరలిస్తాం అని ప్రకటిస్తే, అప్పుడు మాత్రం ఈ మృతుల కుటుంబాలకు శాంతి కలుగుతుందా? ఉపశమనం లభిస్తుందా?

ఇక్కడ విషయం ఏమిటంటే, పరిహారానికి ఎల్ జి తరలింపుకు లింక్ పెట్టకూడదు. పరిహారం అన్నది మృతులు ఇతర కీలక బాధితులకు మాత్రమే. టోటల్ గా ఆ ఏరియాలో భవిష్యత్ లో ఎలాంటి ప్రమాదం సంభవించకుండా వుండడానికి తరలింపు అవశ్యం. కానీ ఓ పక్క పరిశ్రమలు రావడానికి చర్యలు తీసుకోవడం లేదు అని విమర్శించేది ప్రతిపక్షాలే ఇప్పుడు ఈ పరిశ్రమ మూడపెడితే మూడు నుంచి నాలుగు వందల కుటుంబాలు వీధిన పడతాయి. పరోక్షంగా ఎంతో మంది ఇబ్బంది పడతారు.

ఇలా జరగకుండా వుండాలంటే, దశలవారీ తరలింపు లేదా మరేదైనా జాగ్రత్త చర్యలు లాంటివి ప్లాన్ చేయాల్సి వుంటుంది. అది డిమాండ్ చేయాలి. ఆ దిశగా చర్యలు ప్రారంభించేలా వత్తిడి చేయాలి. అంతే తప్ప, తాత్కాలిక ఆవేశ కావేషాలు రెచ్చగొట్టే వ్యవహారాలు కాదు.

అప్పటి నిజాలు బయటపెట్టిన కొడాలి నాని