ఈవారం ట్రేడ్‌ టాక్‌

ఈ ఏడాది తెలుగు సినిమాకి ఎంత ఘనంగా మొదల‌యిందో ఫస్ట్‌ క్వార్టర్‌కి ముగింపు అంత ఇబ్బందిగా పరిణమించింది. ఫిబ్రవరిలో భీష్మ, హిట్‌ చిత్రాలు క్లిక్‌ అవడం కొంతవరకు ఊరట కాగా, మార్చి నెల‌ మొత్తం సినిమా బిజినెస్‌ దారుణంగా దెబ్బ తినేసింది. మొదటి రెండు వారాల‌ పరీక్ష సీజన్‌ కావడంతో పెద్ద చిత్రాలు విడుద కాలేదు. దాంతో నేచురల్‌గానే వసూళ్లు లేవు. 

ఇక మూడవ వారం నుంచి కరోనా బూచి భయపెట్టడంతో థియేటర్లు తెరుచుకోలేదు. ‘వి’ సినిమాతో మళ్లీ సినిమా సందడి మొదవుతుందని అనుకుంటే ఇండియా మొత్తం లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయి ఎప్పటికి పరిస్థితి మామూలవుతుందనేది కూడా అర్థం కావట్లేదు. ఒకవేళ ఏప్రిల్‌ 15న లాక్‌డౌన్‌ ఎత్తేసినా కానీ సినిమా థియేటర్లకి ఇప్పుడే అనుమతి ఇస్తారనేది అనుమానమే.

మరోవైపు యుఎస్‌లో పరిస్థితులు సాధారణ స్థితికి రావడానికి కూడా సమయం పట్టవచ్చు. దీంతో యుఎస్‌ బిజినెస్ కీల‌కమయిన సినిమాలు అక్కడి సిట్యువేషన్‌ నార్మల్‌ అయ్యేవరకు వేచి చూడక తప్పదు. సినీ పరిశ్రమ పెద్దయితే జూన్‌కి మళ్లీ అంతా మామూలు కావచ్చునని అంచనా వేస్తున్నారు. అందాకా పెద్ద సినిమాని వాయిదా వేసుకోవాల‌నే భావిస్తున్నారు. ఏదేమైనా ఈ విపత్తునుంచి తెలుగు సినిమా పరిశ్రమ కోలుకోవడానికి చాలా సమయం పట్టవచ్చు.

లాక్ డౌన్ ఎత్తేస్తున్నారా ?