భీష్మలో సెకెండ్ హీరోయిన్ ఎవరో తెలుసా?

భీష్మ సినిమాలో రష్మిక హీరోయిన్. ఆమె మాత్రమే హీరోయిన్ అనుకున్నారంతా. కానీ ఈ సినిమాలో సెకెండ్ హీరోయిన్ కూడా ఉంది. ఈ విషయం నిన్న సినిమా రిలీజైన తర్వాత జనాలకు తెలిసొచ్చింది. ఆమె మరెవరో కాదు, హెబ్బా పటేల్.

అవును.. భీష్మ సినిమా హెబ్బా పటేల్ తోనే స్టార్ట్ అయింది. రష్మిక కంటే ముందు ఎంట్రీ ఇచ్చేది ఈ ముద్దుగుమ్మే. సినిమాలో ఆమెను చూసిన ప్రేక్షకులు అదొక మెరుపు పాత్ర అనుకున్నారు. అలా అంతా ఊహించినట్టుగానే ఒక 2 నిమిషాల పాటు ఇలా వచ్చి అలా వెళ్లిపోతుంది హెబ్బా పటేల్.

కానీ ఎవరూ ఊహించని విధంగా క్లైమాక్స్ లో కూడా హెబ్బా కనిపించి స్వీట్ షాకిచ్చింది. ఆ మేరకు దర్శకుడు హెబ్బా పటేల్ ను తన స్క్రిప్ట్ లో తెలివిగా ఇరికించాడు. కథతో సంబంధం లేకుండా వచ్చింది అనే విమర్శలు రాకుండా చాకచక్యంగా ఆమె పాత్రను చొప్పించాడు.

అలా భీష్మ సినిమాలో హెబ్బా పటేల్, కీలకమైన అతిచిన్న పాత్ర పోషించింది. ప్రస్తుతం ఈమె ఇలాంటి మెరుపు పాత్రలతోనే నెట్టుకొస్తున్నట్టు కనిపిస్తోంది. ఒరేయ్ బుజ్జిగా సినిమాలో కూడా ఓ చిన్న పాత్ర కోసం హెబ్బాను తీసుకున్నారు.

రష్మిక లెగ్గుతో నితిన్ కి