ఇక పోటీ చేయను తప్పుకుంటున్నాః సుష్మాస్వరాజ్

తను ఇకపై ఎంపీగా పోటీ చేయనని ప్రకటించింది కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్. మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న సుష్మ తన రిటైర్మెంటును అక్కడే అనౌన్స్ చేసింది. ప్రస్తుతం సుష్మ మధ్యప్రదేశ్ లోనే ఉన్న విదిశ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో ఆమె రిటైర్మెంట్ ను అనౌన్స్ చేయడం ఆసక్తిదాయకంగా మారింది.

భారతీయ జనతాపార్టీ సీనియర్ నేతగా, మంచి మాటకారిగా దశాబ్దాలుగా ఆ పార్టీ రాజకీయాల్లో రాణించారు సుష్మా. ఒకదశలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ నాయకురాలిగా కూడా వ్యవహరించారు. ఈమెకు ఉన్న అనుభవం నేపథ్యంలో ఏనాటికి అయినా ప్రధాని పదవి కూడా లభించేదో ఏమో కానీ.. అనారోగ్యం సుష్మ పొలిటికల్ కెరీర్ ను దెబ్బతీస్తోందని తెలుస్తోంది.

ఇప్పటికే ఆమె కిడ్నీకి సంబంధిత సమస్యతో చికిత్స పొందారు. ఆమె మరీ ఎక్కువగా కష్టపడి తిరిగే దశలో లేదని తెలుస్తోంది. అందుకే ఆమె పెద్దగా నియోజకవర్గం వైపు కూడా వెళ్లడం లేదట. దీంతో ఇటీవలే సుష్మ సొంత నియోజకవర్గంలో ఆమె కనుపడుట లేదనే పోస్టర్లు కూడా వెలిశాయి.

ఈ నేపథ్యంలో సుష్మ తన రిటైర్మెంట్ ను అనౌన్స్ చేసింది. తను వచ్చే ఎన్నికల్లో మళ్లీ ఎంపీగా పోటీ చేయాలని అనుకోవడం లేదని ఇప్పటికే అధిష్టానానికి తెలియజేశారు. తన అభిప్రాయం అదని.. ఇక హైకమాండ్ ఏమిచెబితే దానికి అనుగుణంగా నడుచుకుంటానని సుష్మ ప్రకటించింది.

ప్రస్తుతం మోడీ కేబినెట్లో కీలకమైన విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్నా సుష్మ యాక్టివిటీస్ మాత్రం అంత గొప్పగా లేవు. విదేశాలు తిరిగి వచ్చిన మోడీ ఇండియాలోకి రాగానే వెళ్లి స్వాగతం పలకడం తప్ప సుష్మ అంత యాక్టివ్ గా కనిపించడం లేదు. ఆరోగ్య సమస్యలే ఆమెను ఇబ్బంది పెడుతున్నట్టుగా ఉన్నాయి.

ఆసక్తిదాయకంగా 'పోల్‌ తెలంగాణ'... చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్ 

Show comments