కాజల్ పై క్లారిటీ ఇచ్చిన శర్వానంద్

రణరంగం సినిమా రిలీజైన వెంటనే కాజల్ క్యారెక్టర్ పై చాలా కామెంట్స్ పడ్డాయి. అసలు రణరంగం సినిమాకు కాజల్ కు సంబంధం ఏంటని ప్రశ్నించే వాళ్లు కూడా ఉన్నారు. ఇలా అస్సలు ప్రాధాన్యం లేని పాత్రను కాజల్ ఎందుకు చేసిందనే చర్చ మొదలైంది. కొంతమంది ఇంకాస్త ముందుకెళ్లి రెమ్యూనరేషన్ కోసమే కాజల్ ఈ సినిమా ఒప్పుకున్నట్టుందంటూ గాసిప్స్ కూడా పుట్టించారు. ఎట్టకేలకు ఈ మేటర్ పై శర్వానంద్ క్లారిటీ ఇచ్చాడు. కాజల్ ఒప్పుకోవడం తమ అదృష్టం అంటున్నాడు.

"కథ నచ్చి చేసిందామె. సినిమాలో మాకు కాస్త్ బ్రీతింగ్ స్పేస్ కావాలి. నాది 40 ఏళ్ల ఓల్డర్ గెటప్. ఆ క్యారెక్టర్ పక్కన నటించడానికి తను ఒప్పుకోవడం అనేది మాకు బాగా హెల్ప్ అయింది. ఆ సన్నివేశాల్లో కాజల్ లాంటి గ్లామరస్ హీరోయిన్ ఉంటేనే బాగుంటుందని భావించాం. కాజల్ కు సినిమాలో పెద్దగా స్కోప్ లేదని తన ఫ్యాన్స్ ఫీల్ అవ్వొచ్చు. కానీ ఆమె నటించడానికి ఒప్పుకోవడం గ్రేట్. అందుకే కాజల్ కు థ్యాంక్స్."

ఇలా కాజల్ ను ఎందుకు పెట్టాల్సి వచ్చిందో చెప్పుకొచ్చాడు శర్వానంద్. హీరోయిన్ గ్లామర్ లేకుండా, 40 ఏళ్ల వయసుమళ్లిన పాత్రతో అన్ని సన్నివేశాల్ని నడిపిస్తే ప్రేక్షకులకు బోర్ కొడుతుందనే ఉద్దేశంతో కాజల్ లాంటి అందమైన అమ్మాయిని పెట్టామని వివరణ ఇచ్చాడు. మరోవైపు తన సినిమాపై వస్తున్న విమర్శల్ని కూడా అంగీకరించాడు శర్వా. సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదనే విషయాన్ని ఒప్పుకున్నాడు.

"రణరంగం బాగాలేదని ఎవ్వరూ అనలేదు. కాకపోతే అందులో ఏదో మిస్ అయింది. అందుకే ఆశించిన స్థాయిలో ఆడట్లేదు. సినిమా గురించి రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. అదే నాకు కన్ఫ్యూజన్. ఇండస్ట్రీ ఫీడ్ బ్యాక్ ఒకలా ఉంది. ప్రేక్షకులు ఇంకోలా చెబుతున్నారు. ఏం అర్థంకావడం లేదు."

ఇకపై ఇలాంటి డివైడ్ టాక్ రాకుండా మరింత కేర్ ఫుల్ గా ఉంటానంటున్నాడు శర్వానంద్. అవసరమైతే ఇంకాస్త ఎక్కువ టైమ్ తీసుకుంటానని, సినిమా కథ విషయంలో మాత్రం కాంప్రమైజ్ అవ్వనని అన్నాడు. మొత్తానికి రణరంగంకు నెగెటివ్ రివ్యూస్ వచ్చాయనే విషయాన్ని శర్వానంద్ అంగీకరించినట్టయింది.

సాహోపై అంచనాలు ఏ స్థాయిలో వున్నాయంటే..