అయ్యో.. మెహ్రీన్ చనిపోతుందట

హీరోయిన్లు ఓ సినిమా ఒప్పుకునేముందు హీరో ఎవరు, తమకు ఎన్ని సాంగ్స్ ఉన్నాయి, ఎంత గ్లామరస్ గా కనిపించబోతున్నాం లాంటి విషయాల్ని ఆలోచిస్తారు. అంతేకానీ, క్యారెక్టర్ చనిపోయే పాత్రల్ని దాదాపుగా ఎవరూ ఒప్పుకోరు. కానీ మెహ్రీన్ మాత్రం అలాంటి ఓ క్యారెక్టర్ ఓకే చేసింది.

బెల్లంకొండ హీరోగా నటిస్తున్న కవచం సినిమాలో కాజల్, మెహ్రీన్ హీరోయిన్లుగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో మెహ్రీన్ పాత్ర కీలకమైనదే అయినప్పటికీ చాలా చిన్నది. ఇంకా చెప్పాలంటే ఈ సినిమాలో మెహ్రీన్ చనిపోతుంది. ఆమె మర్డర్ మిస్టరీని చేధించడంతో పాటు కాజల్ కు సంబంధించిన ఓ సస్పెన్స్ కు తెరదించే క్రమంలో హీరో ఓ మిషన్ ప్రారంభిస్తాడు. అదే కవచం సినిమా.

నిజానికి ఇందులో చనిపోయే పాత్ర పోషించేందుకు మెహ్రీన్ ఒప్పుకోలేదు. ఎందుకంటే ఆమెకు ప్రస్తుతం సోలో హీరోయిన్ గా అవకాశాలు వస్తున్నాయి. అయినప్పటికీ కవచంలో చిన్న పాత్రకు ఆమె అంగీకరించడానికి కారణం ఫైనాన్షియర్లు. అవును.. ఈ సినిమాకు పెట్టుబడి పెట్టిన వ్యక్తులు మెహ్రీన్ కు పరిచయస్తులు. పైగా భారీ మొత్తం ఆఫర్ చేశారు.

అందుకే చిన్న పాత్ర అయినప్పటికీ చేయడానికి ఒప్పుకుంది. సాక్ష్యం లాంటి ఫ్లాప్ తర్వాత బెల్లంకొండ నుంచి వస్తున్న సినిమా ఇది. పైగా కొత్త దర్శకుడు. బిజినెస్ మొత్తం పూర్తిగా బెల్లంకొండపైనే జరగాలి. అతడి మార్కెట్ వాల్యూపై ఈ సినిమాతో ఓ స్పష్టత వస్తుంది. రేపు థియేటర్లలోకి వస్తోంది కవచం. 

సుజనా ఏమార్చేది ఇలాగేనా చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్ 

Show comments