పిచ్చెక్కిస్తున్న కండోమ్ కొటేషన్స్

సమకాలీన రాజకీయాలపై అమూల్ సంస్థ వేసే కార్టూన్లు, పెట్టే క్యాప్షన్లు అందర్నీ ఎంతగా ఎట్రాక్ట్ చేస్తున్నాయో చూస్తూనే ఉన్నాం. ఇప్పుడీ లిస్ట్ లోకి మరో కంపెనీ కూడా చేరింది. అయితే ఇది కండోమ్స్ తయారుచేసే కంపెనీ. ఈ సంస్థ పెట్టే కొటేషన్లు, కామెంట్లు ఇప్పుడు నెటిజన్లను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. తాజాగా ఈ సంస్థ రణ్వీర్, దీపిక పెళ్లిపై ఓ కొటేషన్ పెట్టింది.

"దీపిక, రణ్వీర్ కు శుభాకాంక్షలు. ఇప్పుడు అధికారికంగా రింగ్ తొడిగే అవకాశం వచ్చేసింది." ఈ కొటేషన్ లో ఎంత కావాలంటే అంత బూతు వెదుక్కోవచ్చు. అంతే కామెడీ కూడా ఉందిక్కడ. మొన్నటికి మొన్న సోనమ్ పెళ్లిపై కూడా ఇలానే స్పందించింది సదరు కండోమ్స్ కంపెనీ. "కంగ్రాట్స్ సోనమ్-ఆనంద్.. ఇకపై మేం మిమ్మల్ని కూడా కవర్ చేస్తాం."

ఇలా ఒకటి కాదు, రెండు కాదు.. రొమాంటిక్ కామెడీ కొటేషన్స్ తో సదరు సంస్థ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అనుష్క-విరాట్ పెళ్లి టైమ్ లో కూడా ఈ సంస్థ తనదైన శైలిలో స్పందించింది. "కంగ్రాట్స్ విరుష్క, ఇకపై మీ ఇద్దరి మధ్య ఏదీ రానివ్వకండి.. ఈ ఒక్కటి తప్ప" అంటూ ఫన్నీగా శుభాకాంక్షలు చెప్పింది.

ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే.. ఇప్పుడు దీపికను పెళ్లాడిన రణ్వీర్ సింగ్, ఈ కంపెనీకి స్వయానా బ్రాండ్ అంబాసిడర్. బాలీవుడ్ నుంచి ఓ కండోమ్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న హీరో రణ్వీర్ మాత్రమే.

పెళ్లి తర్వాత ఫస్ట్ నైట్ అనుభవాలతో ఈ హీరోతో ఇంకాస్త ఫన్నీగా మరో యాడ్ తయారుచేసే పనిలో ఈ కండోమ్ కంపెనీ బిజీగా ఉంది.

Show comments